calender_icon.png 1 August, 2025 | 2:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం కావాలి

31-07-2025 06:03:54 PM

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా కేంద్రంలోని జివి గూడెం వద్ద 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఆగస్టు 4న భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ ను ఆయన ఆదేశించారు.

గురువారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నమూనా,నిర్మాణ పనుల పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి సమీక్షించారు. 5 లక్షల 58 వేల అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ పాఠశాలలో 9 వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్స్, 3000 మందికి ఒకేసారి భోజనాన్ని వండేలా వంటగది, 1280 మంది ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ వంటి వాటితో నిర్మాణాన్ని చేపట్టనున్నారు.