31-07-2025 06:10:02 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార కాంగ్రెస్ పార్టీ భయపడడం వల్లనే రిజర్వేషన్లపై డ్రామా పేరుతో పాదయాత్ర చేస్తుందని బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ ఆరోపించారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తి దాని ముసుగులో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కుట్రలు పండుతుందని ఆరోపించారు. బీసీలకు బిజెపి వ్యతిరేకం కాదని తమ పార్టీలో బీసీలకు ఎంతో గౌరవం ఉందని కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరగదని పేర్కొన్నారు.