చెరువు అభివృద్ధి పనులకు భూమి పూజ
10-04-2026 12:00 AM
తాడ్వాయి, ఏప్రిల్, 9(విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామ శివారులోని పెద్ద చెరువు అభివృద్ధి పనులకు గురువారం స్థానిక సర్పంచ్ సంకుపోచయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గ్రామంలోని పెద్ద చెరువుకు రూ.20 లక్షలు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో చెరువు అభివృద్ధి పనులు నిర్వహిస్తామన్నారు.
నిధులు మంజూరు చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి అన్నదాతగా నిలుస్తున్న పెద్ద చెరువుకు నిధులు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రొద్దుటూరి నవీన్, డి ఈ మనోహర్ రెడ్డి, ఏఈ మధు,వీడిసి అధ్యక్షులు బాలచంద్రం,గ్రామ పెద్దలు రాజయ్య, శ్రీనివాస్ గౌడ్, గణేష్, కాన్షిరాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు.




