ఉపాధి కూలీల సంఖ్య పెరిగేలా చూడాలి
10-04-2026 12:00 AM
గాంధారి, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని మధ్యల కుంట చెరువు వద్ద ఉపాధి హామీ పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల సంఖ్య పెరిగేలా చూడాలి అని సిబ్బందికి సూచించారు. ఉపాధి పనులలో భాగంగా ఫామ్ ఫండ్స్, భూగర్భ జలాలు పెరిగే విధంగా పనులను చేపట్టాలని, రహదారుల నిర్మాణ పనులను చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో రాజేశ్వర్, ఎపిఓ మధు, సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు ఉన్నారు.




