5 May, 2026 | 7:00 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

సుప్రీంకోర్టుకు గ్రూప్-1 అభ్యర్థులు

18-10-2024 03:28 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులు శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖాలు చేశారు. జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును కోరారు. జీవో 29 వల్ల నష్టం జరుగుతుందని, ఆ జీవో తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవో 55నే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినా పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు చేసి, పీఎస్ లో ఉంచి ఇబ్బందులు పెడుతున్నారని గ్రూప్-1 అభ్యర్థులు వాపోయారు. జీవో 29 రద్దుపై వాదనాలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తీర్పు వచ్చే వరకైన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసేల ఆదేశించాలని కోర్టును కోరారు.