21 May, 2026 | 5:55 PM

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-2 గ్రాండ్ టెస్టులు

19-06-2024 12:45 AM

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): గ్రూప్-2 అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రాండ్ టెస్టులను నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 12 బీసీ స్టడీ సర్కిళ్ల కేంద్రాల్లో ఈ టెస్టులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  మొదటి గ్రాండ్ టెస్టు జూలై 8, 9 తేదీల్లో, రెండో గ్రాండ్ టెస్టు అదేనెల 15, 16న, మూడోది 22, 23న, నాల్గోది జూలై 30, 31న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ టెస్టులకు హాజరుకావాలనుకునే అర్హతగల అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 19 నుంచి జూలై 5 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాలని తెలిపారు. వివరాలకు 040- 24071178ను సంప్రదించాలని చెప్పారు.