21 May, 2026 | 5:00 PM

చెరువులు ఆక్రమిస్తే కఠిన చర్యలు

19-06-2024 12:48 AM

ఇరిగేషన్ డీఈ ఉషారాణి

ఇబ్రహీంపట్నం, జూన్ 18 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం కేంద్రా నికి 70 శాతం భూగర్బ జలాలు అందించే బొంతపల్లి కుంట ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ అధికారి డీఈ ఉషారాణి తెలిపారు. మంగళవారం ఇరిగేషన్ అధికారులు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని బొంతపల్లి కుంట చెరు వును పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ ఉషారాణి మాట్లాడుతూ.. 2020లో బొంతకుంట చెరువు ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు వచ్చిం దని, అక్రమంగా నిర్మించిన ప్రహారీ గోడ, గేట్‌ను మరో రెండు రోజుల్లో తొలగించి బఫర్ జోన్‌లో ఇళ్లు కట్టిన యజమానిపై క్రిమినల్ కేసులు పెడుతామని తెలిపారు. 20 ఎకరాలలో ఉన్న ఈ చెరువును ఇష్టానుసారం ఆక్రమించుకొని గృహ నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.