పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం
అభివృద్ధిని విస్మరించిన బీఆర్‌ఎస్
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కామారెడ్డి జిల్లాలో పర్యటన
కామారెడ్డి, డిసెంబర్ 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో విధ్వంసానికి గురైందని ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూప ల్లి కృష్ణారావు విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని విస్మరించిందని మండిపడ్డారు. శనివా రం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం మద్నూర్ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణా స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నిజాంసాగర్ ప్రాజె క్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడారు. తెలంగాణ అమరుల ఆశ య సాధనకు ఇందిరమ్మ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నా రు. త్వరలోనే పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పులపై అసెంబ్లీ సాక్షిగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి జూపల్లి చెప్పా రు. చర్చకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమా అని సవాల్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక ఆనవాళ్లు లేకుండా తెలంగాణ దృశ్యాన్ని ఆవిష్కరించామని తెలిపారు.
నిజాంసాగర్‌కు పూర్వ వైభవం
కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు పూర్వవైభవం తీసుకువస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నామని తెలిపారు. పర్యాటకులకు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్, జలాశయం దిగువన కాటేజీలు, ఉద్యానవనం, చిన్నపిల్లల పార్కు తదితర సౌకర్యాలు అందుబాటులో తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించా రు.
అనంతరం నిజాంసాగర్ హైడ్రో పవర్‌స్టేషన్‌ను పరిశీలించారు. ప్రభుత్వ, ప్రవేట్ భాగస్వామ్యంతో పీపీపీ ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. నిజాంసాగర్ ఐబ్రో పవర్ స్టేషన్‌లో 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను పూర్తిగా ఆధునికరిస్తామని పేర్కొన్నారు.
పలు ప్రదేశాల సందర్శన
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో గల 400 సంవత్సరాల చారిత్రక నాగన్న మెట్ల బావిని స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. బావిని పునరుద్ధరించిన స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, రైన్ వాట ర్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాగన్న మెట్ల బావిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వ సహకారం అందిస్తానని మంత్రి తెలిపారు.
అలాగే జుక్కల్ మండలం కౌలాస్ కోటను మంత్రి జూపల్లి సందర్శించారు. అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస్ కోటను పరిరక్షించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపా రు. మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మంత్రిని కోరారు. కౌలాస్ కోట అభివృద్ధి కోసం ప్రతిపాదనలు రూపొందించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మంత్రి ఆదేశించారు.
నాగిరెడ్డిపేట మండ లం పోచారం ప్రాజెక్ట్‌ను మంత్రి జూపల్లి సందర్శించారు. జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహ న్‌రావు, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో కలిసి పోచారం జలాశయంలో బోటిం గ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో బాన్సువాడ అదనపు కలెక్టర్ కిరణ్మయి, మార్కెట్ కమిటీ చైర్మన్లు సౌజన్య, ప్రమోద్‌కుమార్, కాంగ్రెస్ నాయకులు రాములు, సాయాగౌడ్, లక్ష్మణ్ గొండ, సురేష్‌గుండా, దిలీప్, పాటిల్, నాగేశ్వర్‌రావు, సంపత్‌రెడ్డి, మల్లికార్జున అప్ప తదితరులు పాల్గొన్నారు.
చిచ్చు రేపిన మంత్రి పర్యటన
మంత్రి జూపల్లి కృష్ణారావు కామారెడ్డి జిల్లా పర్యటన కాంగ్రెస్ నేతల్లో చిచ్చు రేపింది. అధికార పార్టీ ప్రముఖులు వస్తే ఎలాంటి ఆందోళనలు, నిరసనలు జర గకుండా ప్రతిపక్ష నేతలను ఒకరోజు ముందే పోలీసులు అదుపులోకి తీసు కుంటారు. కానీ శనివారం జుక్కల్ నియో జకవర్గ పర్యటనకు మంత్రి జూపల్లి కృష్ణారావు రాక సందర్భంగా నియో జకవర్గంలోని సీనియర్ కాంగ్రెస్ నాయ కులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు.
దీంతో ఆ పార్టీ నాయకులు విస్మ యానికి గురయ్యారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఒంటెద్దు పోకడల వల్ల గెలిపించిన వారినే జైళ్లలో పెట్టించ డం ఎంతవరకు సమంజసమని సీనియ ర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ విష యమై గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ క్రమంలోనే మంత్రి పర్యటన నేపథ్యం లో అరెస్టులు చేయడం మరింత ఆజ్యం పోసినట్టయింది.




