14-03-2025 01:19:59 AM
కావాలనే కొందరి తప్పుడు ప్రచారం: టీజీపీఎస్సీ
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): గ్రూప్-1 ఫలితాలను పారదర్శకంగానే వెల్లడించినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. కొంతమంది వ్యక్తు లు, కొన్ని సంస్థలు తప్పుడు సమాచారాన్ని వ్యా ప్తి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. ఫలితాలపై స్పష్టతనిస్తూ ఈమేరకు టీజీపీఎస్సీ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కొంతమంది తమ స్వార్థప్రయోజనాలకు అనుగుణంగా సమాచారాన్ని విశ్లేషించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, తద్వారా అభ్యర్థుల్లో గందరగోళాన్ని సృషించే ప్రయన్నతం చేస్తున్నారని తెలిపింది. గతేడాది నవంవర్ 1 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకు గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పారదర్శకంగా, క్షుణ్ణంగా చేపట్టినట్లు పేర్కొంది.
ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి మూల్యాంకనం చేసిన ఎవాల్యుయేటర్ల వివరాలను సైతం టీజీపీఎస్సీ వెల్లడించింది. పేపర్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన అత్యధిక మార్కులు వెల్లడించింది. ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ పేపర్‌లో అత్యధిక మార్కులు 139.5, పేపర్ 1 -97.5, పేపర్2-102.5, పేపర్3-102.5, పేపర్4- 113.5, పేపర్5-96.5, పేపర్6 వచ్చినట్లు తెలిపింది.
మొత్తం అభ్యర్థుల్లో ఇంగ్లిష్ మీడియంలో 12,323 మంది, తెలుగు మీడియంలో 7,829 మంది, ఉర్దూ మీడియంలో 9 మంది రాసినట్లు వివరించింది. 100 ర్యాంకుల్లో 59 మంది పురుషులు, 41 మంది మహిళలున్నట్లు తెలిపింది. వీరిలోనూ ఓసీ అభ్యర్థులు 32, బీసీ- 48, ఎస్సీ-3, ఎస్టీ-5, ఓసీ ఈడబ్ల్యూఎస్-12 మంది ఉన్నట్లు పేర్కొంది.