25-11-2025 02:42:58 PM
నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్
కాటారం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి అనూహ్యా స్పందన, ఆదరాభిమానాలు లభిస్తున్నాయని మంథని శాసనసభ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంథని నియోజకవర్గం పరిధిలోని కాటారం మండలంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి శ్రీధర్ బాబు మార్గదర్శకాల మేరకు ఇంటింటికి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దీక్ష కంకణబద్ధులై చేపడుతున్నారని తెలిపారు. గత బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలో మహిళలను పట్టించుకున్న దాఖలాలు లేవని సందీప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా అమలు చేసి ప్రజల నుంచి జేజేలు పొందుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు.
త్వరలో మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందని పేర్కొన్నారు. రెండున్నర సంవత్సరాల్లోనే ప్రజలకు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూర్చామని, రాబోయే రోజుల్లో మహిళలకు మరింత మెరుగైన జీవితాలను, ఆర్థిక ఆదాయాలను సమపార్ధించుకోవడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పసుల మొగిలి, ఓబీసీ మండల అధ్యక్షుడు కొట్టే ప్రభాకర్, మండల అధికార ప్రతినిధి కొట్టే శ్రీహరి, మండల ప్రధాన కార్యదర్శి చీమల రాజు, నాయకులు ఎండి అజీజ్, గోనే శ్రీనివాస్, ఎండి బషీర్ ఖాన్, కొమురయ్య యాదవ్, తిరుపతి, ఆడవాల సమ్మయ్య, జాడి రాజేష్, తదితరులు పాల్గొన్నారు. కాటారం మండలంలోని బయ్యారంలో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చీనాల బ్రహ్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు జాగిరి శ్రీనివాస్, రాజబాబు, ఎనుగాల లింగయ్య, శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, ఐకెపి వివో ఏ స్వప్న , మహిళలు పాల్గొన్నారు.
చీరల పంపిణీ సజావుగా సాగుతోంది: ఎంపీడీఓ బాబు
కాటారం మండలంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చీరల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతుందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడ్డూరి బాపు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఇందిరా క్రాంతి పథం , ఈజీఎస్ సిబ్బంది కార్యక్రమాలను పర్యవేక్షణ చేస్తున్నట్లు వెల్లడించారు