calender_icon.png 25 November, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు పెద్దపీట: కలెక్టర్ కుమార్ దీపక్

25-11-2025 02:51:54 PM

లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో DRDO కిషన్ తో కలిసి మూడు మండలాల స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందించి మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ. 6 కోట్లను స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించామని అన్నారు. దండేపల్లి మండలం 703 గ్రూపులకు రూ. 62,34,770,  హాజీపూర్ మండలంలోని 469 గ్రూపులకు రూ. 45,68,470, లక్షెట్టిపేట మండలంలోని 446 గ్రూపులకు రూ. 35,57,903, ఇలా మూడు మండలాల SHG లకు కోటి 43 లక్షల 616 రూపాయల వడ్డీలేని రుణాలను అందించామని తెలిపారు.

ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని సమాజంలో అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ అవినాష్, ఆర్టిఎ మెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షుడు ఆరీప్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు నలిమెళి రాజు,  మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పూర్ణ చందర్, దండేపల్లి మాజీ జెడ్పీటీసీ గడ్డం త్రిమ్తూర్తి, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ముని, జిల్లా సమైక్య అద్యక్షురాలు అనిత, హాజిపూర్, లక్షేట్టిపేట, దండేపల్లి మండలాలు ఐకెపి ఏపీవోలు, తహసీల్దార్, ఎంపీడీవోలు, సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.