calender_icon.png 25 November, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్.. టీమిండియా టార్గెట్..

25-11-2025 03:58:13 PM

గౌహతి: బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా నాలుగో రోజు టిమిండియాతో జారుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ను ముగించింది. దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌ను 260/5 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ట్రిస్టన్ స్టబ్స్ 94 పరుగులు చేశాడు. మంగళవారం జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 288 కలిపి 549 పరుగుల రికార్డు విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. వన్ డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్(94) చేసి సెంచరీ ముంగిట ఔటయ్యాడు. దక్షిణాఫ్రికా నాలుగో రోజు చివరి సెషన్‌లో డిక్లేర్ చేసింది. 

ఎడమచేతి వాటం స్పిన్నర్ జడేజా చెలరేగే వరకు, స్టబ్స్ నాల్గవ వికెట్‌కు 101 పరుగులు చేయగా, టోనీ డి జోర్జీ (49), రికెటన్ (35), వియాన్ ముల్డన్(35), మార్ క్రమ్ (29) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (4), వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 489 పరుగులు చేయగా, భారత్ 201కే ఆలౌట్ అయింది. 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్స్ దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. గౌహతిలో డ్రా అయినా కూడా 2000 తర్వాత భారతదేశంలో వారి మొదటి సిరీస్ విజయాన్ని నమోదు చేస్తుంది. కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఆరు స్వదేశీ టెస్టుల్లో నాలుగో ఓటమిని చవిచూసింది. భారత్ జట్టు మరో ఓటమిని నివారించడానికి మూడు సెషన్లకు పైగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక విజయవంతమైన పరుగుల ఛేదనగా 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ చేసిన 418 పరుగులు రికార్డు సృష్టించగా, 1976లో వెస్టిండీస్‌పై భారత్ చేసిన 406 పరుగులు రికార్డు సృష్టించాయి.