11 August, 2026 | 10:47 PM

నిబంధనలు పాటించని స్కూల్ బస్సులు

15-06-2024 12:05 AM

కేసులు నమోదు చేసిన అధికారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మూడు రోజుల్లో 64 ఫిట్‌నెస్ లేని బస్సులపై కేసులు నమోదు చేసినట్టు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సి.రమేష్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ జేటీసీ పరిధిలోని ఖైరతాబాద్, తిరుమలగిరి, మలక్‌పేట్, బహదూర్‌పురా, టోలిచౌకి ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 64 స్కూల్ బస్సులపై కేసులు నమోదయ్యాయి. 

రంగారెడ్డిలో 10 కేసులు.. 

రంగారెడ్డి, జూన్ 14 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో ఫిట్‌నెస్ లేని పది బస్సులపై కేసులు నమెదు చేసినట్లు డీటీవో చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. విద్యార్థులను తరలించే స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులను తరలించే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని డీటీవో హెచ్చరించారు.