మొక్కలు పెంచడం మనందరి బాధ్యత
08-08-2025 11:25 PM
నకిరేకల్ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం బాధ్యతగా గుర్తించాలని ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు(MPDO Gnana Prakash Rao), ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లయ్య(Excise Circle Inspector Mallaiah) అన్నారు. శుక్రవారం కట్టంగూరు మండలంలోని ఈదులూరు గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈత మొక్కలును నాటారు, గీత కార్మికులకు రెండు వేల మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మానవాళి మనుగడకు మొక్కలే ఆధారమన్నారు. మొక్కలు పెంచడం వల్ల మనకు ఆరోగ్యాన్ని ఆక్సిజన్ ని అందిస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.ఓ, కడెం రామ్మోహన్, సిపియస్, వెంకన్న, యఫ్ఏ యాదగిరి, దండంపెల్లి శ్రీను కార్మిక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






