08-08-2025 11:22:59 PM
హుజూర్ నగర్ ఫ్లైఓవర్ వద్ద సర్వీసు రోడ్డును వాహనదారులు ఉపయోగించుకోవాలి
పట్టణ సీఐ శివశంకర్..
కోదాడ: కోదాడలో కట్టకొమ్ముగూడెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి నెం. 65 నుంచి రెండు వైపులా రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పట్టణ సీఐ శివశంకర్(CI Shiva shankar) తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ఇటీవల జాతీయ రహదారి బైపాస్ వెడల్పు చేయడం వలన రోడ్డు మీదుగా కట్టకొమ్ముగూడెం రోడ్డుకు రాకపోకలు సాగిస్తుండడం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ఉత్తమ్ పద్మావతి నగర్, ఆయా గ్రామాల ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డును రెండు వైపులా మూసివేస్తున్నట్లు వివరించారు. ప్రజలు, వాహనదారులు గమనించి హుజూర్ నగర్ ఫ్లై ఓవర్ కింద సర్వీస్ రోడ్డు ఉపయోగించుకోవాలని తెలిపారు.