calender_icon.png 9 August, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాల్లో ఘనంగా వరలక్ష్మీ పూజలు

08-08-2025 11:27:30 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని బురదగూడెం త్రిశక్తి అష్టలక్ష్మి, కామాఖ్య దేవి, మహంకాళి దేవాలయంలో కుంకుమార్చన, సామూహిక వరలక్ష్మీ వ్రతాలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకొని ఆలయంలో మహిళా భక్తులు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సతీష్ భవాని మాట్లాడుతూ, లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం కోసం మహిళా భక్తులచే సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆచరించడం జరిగిందన్నారు. శ్రావణమాసం పురస్కరించుకొని నెలరోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలో తరించాలని ఆయన కోరారు.

దుర్గా భవాని ఆలయంలో...

పట్టణం లోని కెకె 1 సిఎస్పి దుర్గ భవాని దేవాలయంలో వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజును పురస్క రించుకొని ఆలయంలో మహిళా భక్తులతో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నర్సింగ్ భవాని మాట్లాడుతూ, పవిత్ర శ్రావణమాసంలో శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి వ్రతాలు పూజలు నిర్వహించిన భక్తులకు కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.