calender_icon.png 15 February, 2026 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రోత్ అండ్ చైల్డ్ ఒబెసిటీ క్లినిక్ ప్రారంభం

15-02-2026 12:39:47 AM

మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహణ

ట్విన్ సిటీస్‌లో పిల్లల ఆరోగ్య సమస్యలపై క్లినిక్‌లో వైద్య సేవలు   

హైదరాబాద్, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): మెడికవర్ ఉమెన్ అండ్ చైల్ హాస్పిటల్ ట్విన్ సిటీస్‌లో పెరుగుతున్న పిల్లల ఎదుగుదల లోపాలు, అధిక బరువు సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ‘గ్రోత్ అండ్ చైల్డ్ ఒబెసిటీ క్లినిక్’ను ప్రారంభించిం ది. కార్యక్రమంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు.

ముఖ్య అతిథి డాక్టర్ టి.ఉషారాణి(ప్రెసిడెంట్, ఐఏపీ ట్విన్ సిటీస్) మాట్లాడుతూ ఇటీవల పిల్లలు ఎత్తులో పెరగకుండా బరువు మాత్రం పెరుగుతున్న పరి స్థితి ఎక్కువగా కనిపిస్తోంది. క్రమం తప్పకుండా గ్రోత్ మానిటరింగ్, బీఎంఐ ట్రాకిం గ్, సరైన పోషకాహార సలహాలు ఇవ్వడం తప్పనిసరి. పిల్లల ఆరోగ్యం కోసం వైద్యులు, తల్లిదండ్రులు, పాఠశాలలు కలిసి పనిచేయా లి  అని పేర్కొన్నారు. విభాగాధిపతి, ప్రోగ్రాం లీడర్ డాక్టర్ రవీందర్‌రెడ్డి పరిగే మాట్లాడుతూ ఈ క్లినిక్‌లో ప్రామాణిక గ్రోత్ చార్టిం గ్, ఒబెసిటీ రిస్క్ అసెస్‌మెంట్, మెటబాలిక్ స్క్రీనింగ్, అవసరమైన రిఫరల్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు.

నియమిత బాలల ఆరోగ్య పర్యవేక్షణపై డాక్ట ర్ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వెల్ -చైల్డ్ చెక్-అప్‌లో ఎత్తు, బరువు, బీఎంఐ, అభివృద్ధి దశలను పరిశీలించడం ద్వారా ప్రారం భ దశలోనే సమస్యలను గుర్తించి సులభమైన ఆహార, జీవనశైలి మార్పులతో సరిచే యవచ్చునన్నారు. కుటుంబ జీవనశైలిలో మార్పుల అవసరాన్ని వివరించిన డాక్టర్ స్వాతి.టి  మాట్లాడుతూ అధిక ప్రాసెస్డ్ ఆహారాలను తగ్గించడం, పిల్లలకు రోజువారీ శారీరక ఆటలు ప్రోత్సహించడం, సరైన నిద్ర అలవాటు, స్క్రీన్ టైమ్ నియంత్రణ ఇవన్నీ ఒబెసిటీ నివారణలో కీలకం అన్నారు.

తల్లిదండ్రులకు క్రమం తప్పని కౌన్సెలింగ్ అవస రం అన్నారు. సమగ్ర శిశు సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ డాక్టర్ మధుమోహన్ రెడ్డి  సమస్యలను ప్రారంభ దశలో గుర్తిస్తే భవిష్యత్తులో క్లిష్టమైన చికిత్సలు అవసరం ఉండకపోవచ్చు. నివారణాత్మక వైద్యం పిల్ల ల దీర్ఘకాల ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం. హార్మోనల్, మెటబాలిక్ మూల్యాంకనంపై డాక్టర్ అమర్‌నాథ్ కులకర్ణి మాట్లాడుతూ   మాట్లాడుతూ, ఎత్తు పెరుగుదల లోపం లేదా తీవ్రమైన స్థూలకాయం ఉన్న పిల్లల్లో ఎండోక్రైన్ మూల్యాంకనం అవసరం అన్నా రు.

పీడియాట్రిక్-ఎండోక్రైన్ సమన్వయం ద్వారా సరైన నిర్ధారణ, లక్ష్యిత చికిత్స అం దించవచ్చునన్నారు.ఈ గ్రోత్ అండ్ చైల్డ్ ఒబెసిటీ క్లినిక్ పాఠశాలల్లో స్క్రీనింగ్ క్యాం పులు, అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహిస్తూ ట్విన్ సిటీస్ లో పిల్లల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించనుంది. పిల్లల ఎదుగుదల, బరువు సమ స్యల విషయంలో ఈ రోజు తీసుకునే జాగ్ర త్త రేపటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది అనే సందేశాన్ని ఈ కార్యక్రమం స్పష్టంగా తెలియజేస్తోంది.