27-07-2025 08:15:25 PM
బంగారునంది ఆల్ ఇన్ ఒన్ అవార్డుకి ఎంపిక..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణానికి చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు, ప్రముఖ కవి, సాహితీవేత్త, మోటివేషనల్ స్పీకర్ సురేష్ బాబు, తోటమల్ల మరో పురస్కారానికి ఎంపికయ్యారు. హైద్రాబాదుకి చెందిన రుద్ర బెస్టు హెల్పింగ్ ఫౌండేషన్ వారు సురేష్ బాబు, తోటమల్లను బంగారు నంది ఆల్ ఇన్ అవార్డు ప్రకటించి ఈ మేరకు ఆహ్వానాన్ని పంపించారు. వివిధ రంగాలలో అత్యున్నత ప్రతిభ కనపరుస్తున్న ఈయనను ఈ అవార్డుకు ఎంపిక చేసారు. ఆగస్ట్ 10వ తేదీన హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమగమం నందు సినీప్రముఖల ద్వారా అందుకోనున్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ, అవార్డులు బాధ్యతలను మరింత పెంచుతాయని అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. ఈయనకు బంగారు నంది అవార్డు రావడం పట్ల పి ఆర్ టి యు రాష్ట్రనాయకులు ధనుకొండ శ్రీనివాసరావు, కృష్ణ, పటేల్ లక్ష్మి నారాయణ, పొడపాటి శ్రీనివసరావులు హర్షం వ్యక్తం చేసారు.