16 May, 2026 | 2:49 AM

ప్లే ఆఫ్ బెర్తుపై గుజరాత్ కన్ను

16-05-2026 01:13 AM

కోల్‌కతాకు డూ ఆర్ డై

కోల్ కతా, మే 15 : ఐపీఎల్ 19వ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ ఎప్పటిలానే రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ అధికారికంగా ఏ జట్టూ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. అ యితే టాప్-2లో ఉన్న జట్లు మాత్రం దా దాపుగా ప్లే ఆఫ్ చేరినట్టే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ బెర్తును ఖరారు చేసుకోవాలని గుజరాత్ భావిస్తోంది. వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచిన గుజరాత్ మంచి ఫామ్‌లో ఉంది.

నిజా నికి సీజన్ ఆరంభంలో తడబడుతూ సాగిన గుజరాత్ తర్వాత అద్భుతంగా పుంజుకుం ది. బ్యాటింగ్, బౌలింగ్‌లలో సమిష్టిగా రాణి స్తూ టాప్-2లోకి దూసుకొచ్చింది. గుజరా త్‌కు బ్యాటింగ్‌లో గిల్, సాయి సుదర్శన్, బట్లర్ అతిపెద్ద బలం. ఈ ముగ్గురిలో ప్రతీసారీ ఇద్దరు రాణిస్తున్నారు.  సాయి సుద ర్శ న్ 501 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉండగా.. గిల్ ఆరో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. వాషింగ్టన్ సుందర్ కూ డా కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నా డు. చివర్లో జాసన్ హోల్డర్ మెరుపులు మెరిపిస్తుండగా... తెవాటియా ఇప్పటి వరకూ పె ద్దగా ఆడింది లేదు.

బౌలింగ్‌లో రబాడ, మ హ్మద్ సిరాజ్ అదరగొడుతున్నారు. వీరిద్దరి తో పాటు హోల్డర్ కూడా కీలక సమయం లో వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నాడు. హో ల్డర్ 6 మ్యాచ్‌లలో 13 వికెట్లు తీ సాడు. స్పి న్ విభాగంలో రషీద్ ఖాన్ కూడా ఫామ్ లోకి రావడం అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు.  కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఇది డూ ఆర్ డై మ్యా చ్. గుజరాత్‌పై గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఈ సీజన్‌లో అధికారికంగా కేకేఆర్ కథ ముగుస్తుంది. ఇ ప్పటి వరకూ 4 విజయాలు సాధించిన కోల్‌కతా పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.

వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత ఆర్సీబీ చేతిలో ఓటమి కేకేఆర్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసింది. గత మ్యాచ్‌లో కోల్కతా భారీస్కోరే చేసినా బౌలర్లు చివర్లో ఒత్తిడికి లోనై కొంపముంచారు. బ్యాటింగ్‌లో రహానే, ఫిన్ అలెన్ మం చి ఆరంభాలనే ఇస్తుండగా రఘువంశీ, గ్రీన్ రాణిస్తున్నారు. చివర్లో రింకూ సింగ్ కీలక ఇ న్నింగ్స్‌లు ఆడుతుండడం కోల్‌కతాకు ప్లస్ పాయింట్. బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లూ మరింత రాణించాల్సిన అవసరముం ది. 

తుది జట్లు అంచనా

గుజరాత్ టైటాన్స్ : గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, బట్లర్, వాషింగ్టన్ సుందర్, హోల్డ ర్, నిశాంత్ సింధు, తెవాటియా, రషీద్ ఖా న్, అర్షద్ ఖాన్, రబాడ, సిరాజ్

కోల్‌కతా నైట్ రైడర్స్ : రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, రఘువంశీ, గ్రీన్, రింకూ సింగ్, మనీశ్ పాండే, సునీల్ నరైన్, అంకుల్ రాయ్ , వైభవ్ అరోరా, సౌరవ్ దూబే, కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్