26 August, 2026 | 4:13 PM

సర్ ప్రక్రియలో గ్రామ సభలే కీలకం

26-08-2026 03:04 PM

 బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకం

(ఖమ్మం, విజయ క్రాంతి): ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా రేపు 27-08-2026 న జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించనున్నారని, ఈ గ్రామ సభలలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్ల ముసాయిదా జాబితాను చదివి వినిపిస్తారని, అదే విధంగా తొలగించిన ఏ ఎస్ డి డి (ఆచూకీ దొరకని, వలస వెళ్లిన, మృతి చెందిన,డూప్లికేట్) ఓటర్ల వివరాలను వెల్లడిస్తారని, ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం అనామలీస్ ,

నో మ్యాపింగ్ కింద 1,76,135 మంది ఓటర్లకు, ఖమ్మం నియోజకవర్గంలోని 65,276, పాలేరు నియోజకవర్గంలోని 40,698, మధిర నియోజకవర్గం లోని 27,834, వైరానియోజకవర్గం లోని 22,101,సత్తుపల్లి నియోజకవర్గం లోని 20,226 మంది ఓటర్లకు ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు ఇవ్వనున్నారని, ఈ కార్యక్రమం అంతా ప్రజల, బూత్ లెవెల్ ఏజెంట్ల సమక్షంలో ఎన్నికల సంఘం అధికారులు చదివి వినిపిస్తారని తెలిపారు. 

కాబట్టి ఎటువంటి పొరపొచ్చాలు జరిగినా బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ గ్రామ సభలను అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని తక్షణమే స్పందించాలని, బోగస్ ఓట్లు, తదితర అభ్యంతరాలు ఉంటే బూత్ లెవెల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లాలని , అదే విధంగా గ్రామ సభల్లో ఫారం -6,ఫారం -7, ఫారం-8 అందుబాటులో ఉంచుతారు కావున బూత్ లెవెల్ ఏజెంట్లు గ్రామంలోని ముఖ్య నాయకులతో కలిసి గ్రామ సభలో  విధిగా పాల్గొనాలని, అదే విధంగా బూత్ లెవెల్ సూపర్ వైజర్ (మండల, పట్టణ అధ్యక్షులు) లు మీ పరిధిలోని అన్ని బూత్ లలోని గ్రామ సభలలో బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ప్రత్యక్షంగా పాల్గొనాలని  తద్వారా అర్హత గల ప్రతి పౌరుని ఓటు ఓటర్ జాబితా లో ఉండేలా  చేయాలని పత్రికా ముఖంగా కోరిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్.