26 August, 2026 | 3:50 PM

బిల్లుల కోసమే భట్టిని కలిశా: రాజగోపాల్ రెడ్డి

26-08-2026 03:18 PM

హైదరాబాద్: ప్రజాభవన్(Praja Bhavan)లో బుధవారం కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరిగింది. భేటీ అనంతరం బయటకొచ్చిన నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) మాట్లాడుతూ.. తన నియోజకవర్గ బిల్లుల కోసమే భట్టి విక్రమార్కను(Bhatti Vikramarka) కలిసినట్లు తెలిపారు. అప్పటికే ప్రజాభవన్ లో కొండా మురళి ఉన్నారని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా భవన్ లో కొండా మురళిని కలిసినట్లు చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొండా సురేఖ వివాదం(Konda Surekha controversy) కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ప్రజాభవన్ కు వచ్చి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.