29 May, 2026 | 1:42 AM

ఫైనల్ చేరేదెవరో?

29-05-2026 12:00 AM

గుజరాత్‌తో రాజస్థాన్ ఢీ

వైభవ్‌పైనే అందరి చూపు

గుజరాత్ బౌలర్లకు సవాల్

ఐపీఎల్ 19వ సీజన్‌లో ఇక మిగిలిన ఒక ఫైనల్ బెర్త్ కోసం రెండు జట్లు పోటీలో నిలిచాయి. క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. ఇక్కడ మరో ఈక్వేషన్ ఏం లేదు. గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరితే ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. ఇరు జట్లలోనూ అదిరిపోయే ఓపెనర్లు, మ్యాచ్‌ను మలుపుతిప్పే బౌలర్లు ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయం. మరి ఆర్‌సీబీ చేతిలో ఓడిన గుజరాత్ ముందంజ వేస్తుందా ? లేక సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన రాజస్థాన్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుందా ?

న్యూ ఛండీఘర్: ఐపీఎల్ 19వ సీజన్ ఛాంపియన్ ఎవరో తేలడానికి ఇక రెండే మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ చేరగా, మరో బెర్త్ కోసం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. న్యూ ఛండీఘర్ వేదికగా శుక్రవారం క్వాలిఫైయర్ 2 జరగబోతోంది. 

రెండోసారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుజరాత్ భావిస్తుం టే, సన్‌రైజర్స్‌ను నిలువరించి ఫుల్ జోష్ లో ఉన్న రాజస్థాన్ టైటాన్స్‌కు చెక్ పెట్టాలని పట్టుదలగా ఉంది. కాగా లీగ్ స్టేజ్‌ను రెండో స్థానంతో ముగించిన గుజరాత్ టైటా న్స్ తొలి క్వాలిఫైయర్‌లో బెంగళూరుపై పరాజయం పా లైంది. భారీస్కోరు ఛేదించలేక చతికిలపడింది. ఆ మ్యాచ్ లో బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోగా.. బ్యాటర్లు నిరాశ పరిచారు.

నిజానికి ఈ సీజన్‌లోనూ గుజరాత్ ఓపెనింగ్ జోడీ సూపర్ ఫామ్‌లో ఉంది. సాయి సుదర్శన్, గిల్ తమ అద్భుతమైన బ్యాటింగ్‌తో మెరుపు ఆరంభాలనిస్తున్నారు. తర్వాత బట్లర్ కూడా రాణిస్తున్నాడు. అయితే టాపార్డర్‌లో ఈ ముగ్గురూ నిలబడితే ఎంత బలమో, విఫలమైతే అంతే సంగతులు. ఈ ముగ్గురూ ఫెయిలైన తర్వాత నిలకడగా రాణించే బ్యాటర్లు లేకపోవడం గుజరాత్‌కు మైనస్ పాయింట్. ఈ సీజన్‌లో గుజరాత్ ఓడిన ప్పుడు టాపార్డర్ ఫెయిలవడమే కారణం.

గిల్, సాయి సుదర్శన్ మెరుపు ఆరంభాలనిస్తేనే గుజరాత్‌కు భారీస్కోరు చేసే అవకాశముంటుంది. మిడిలార్డర్‌లో నిలక డైన బ్యాటర్ ఒక్కరూ లేకపోవడం ఇబ్బందిగా మారింది. మరోవైపు బౌలింగ్‌లో గుజరాత్ నిలకడగానే రాణిస్తోంది. రబాడ, సిరాజ్‌తో పాటు హోల్డర్ కూడా సత్తా చాటుతున్నారు.

వీరితో పాటు  స్పిన్నర్లు రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ చెలరేగితే గుజరాత్‌కు తిరుగుండదు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ పడుతూ లేస్తూ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఆ జట్టు బ్యాటింగ్‌కు కూడా ఓపెనర్లే బ లం. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ మంచి ఆరంభాలనిస్తున్నారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కొడితే సిక్సర్, లేకుంటే బౌండరీ అన్న తరహాలోనే ఆడుతున్నాడు.

సన్ రైజర్స్ పై ఎలిమినేటర్ ఎలాంటి విధ్వంసం సృష్టించాడో అందరూ చూసారు. దీంతో వైభవ్‌ను ఎంత త్వరగా ఔట్ చేస్తే గుజరాత్ కు అంత విజయా వకాశం ఉంటుంది. జురెల్ అదరగొడుతున్నా.. తర్వాత బ్యాటర్లు నిరాశ పరుస్తున్నారు. పరాగ్, ఫెరీరా, జడేజా కూడా చెలరేగాల్సిన అవసరం ఉంది. మరోవైపు బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్‌కు మ్యాచ్ విన్నర్. తన బౌలింగ్‌తో వరుస విజయాలను అందించాడు. అతనితో పాటు బర్గర్ కూడా రాణిస్తుండగా.. స్పి న్నర్లు జడేజా, యశ్ రాజ్ కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. 

గత రికార్డులు

ఐపీఎల్‌లో గుజరాత్,- రాజస్థాన్ జట్లు 10 సార్లు తలపడ్డాయి. గుజరాత్ ఏడు మ్యాచ్‌లలో గెలిస్తే, మూడిం టిలో రాజస్థాన్ విజయం సాధించింది. అటు పిచ్ పరిస్థితిని చూస్తే మరోసారి పరుగుల వరద ఖాయమని అం చనా వేస్తున్నారు.

పిచ్ రిపోర్ట్ 

న్యూ ఛండీఘర్ పిచ్‌పై మరోసారి పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీస్కోరు నమోదు చేస్తే అతికష్టంపై కాపాడుకోవచ్చు.

తుది జట్ల అంచనా 

గుజరాత్: సాయి సుదర్శన్, గిల్(కెప్టెన్), బట్లర్, నిశాంత్ సంధు, వాషింగ్టన్ సుందర్, హోల్డర్, తెవాటి యా, రషీద్‌ఖాన్, రబాడ, అర్షద్ ఖాన్, సిరాజ్

రాజస్థాన్: జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, జురెల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), ఫెరీరా, శుభమ్ దూబే, శనక, ఆర్చర్, బర్గర్, యశ్ రాజ్, బ్రిజేశ్ శర్మ