14 July, 2026 | 3:37 PM

Breaking News

సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •  

కార్లసన్‌కు ప్రజ్ఞానంద షాక్

29-05-2026 12:00 AM

నార్వే చెస్ టోర్నీ

ఓస్లో, మే 28: భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. నార్వే చెస్ టోర్నమెంట్లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ మాగ్నస్ కార్లసన్‌పై సంచలన  విజయం సాధించారు. సొంతగడ్డపై కార్లసన్‌ను ప్రజ్ఞానంద ఓడించాడు. దీంతో మూడు పుల్ పాయింట్లను కూడా సాధించాడు. ఈ గేమ్ ఆరంభం నుంచీ ప్రజ్ఞానంద దూకుడుగా ఆడాడు.

మధ్యలో కాస్త తడబడినా అద్భుతంగా పుంజుకున్నాడు. ఈ క్రమంలో నార్వేలో కార్లసన్ అజేయయాత్రకు ప్రజ్ఞానంద మరోసారి బ్రేక్ వేశారు. ఏడు సార్లు చాంపియన్ అయిన కార్లసన్‌ను ఆయన సొంత దేశంలోనే మళ్లీ ఓడించారు. చెస్ చరిత్రలో ఇదో ఘనమైన రికార్డుగా నిలిచింది.. గత ఏడాది కూడా ఇక్కడే కార్లసన్‌పై ప్రజ్ఞానంద గెలుపొందాడు. ఈ సీజన్‌లో ప్రజ్ఞా నంద మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల రొమేనియాలోని బుచారెస్టో వేదికగా జరిగిన సూపర్‌పెట్ చెస్ క్లాసిక్ టోర్నీలో ప్రజ్ఞా నంద విజయం సాధించారు.

అదే ఉత్సాహంతో నార్వే చెస్ టోర్నీలో అతను అడుగు పెట్టాడు. ప్రస్తుతం కార్లసన్ కేవలం 1.5 పాయింట్లతో పోరాడుతున్నారు. నార్వే చెస్ క్లాసిక్ విభాగంలో రెండోసారి ప్రజ్ఞానంద గెలుపొందాడు. మరోవైపు వరల్డ్ ఛాంపియన్ గుకేశ్‌కు మరో ఓటమి ఎదురైంది. గుకేశ్‌పై గెలిచిన ఫిరౌజా ప్రస్తుతం టోర్నీలో టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తున్నాడు. అతను క్లాసిక్ గేమ్‌లో కీలకమైన 1.5 పాయింట్లు సాధించి మొత్తం 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.