డ్రాతో సరిపెట్టుకున్న గుకేశ్, ప్రజ్ఞానంద
24-08-2024 12:30 AM
సెయింట్ లూయిస్: సిన్‌క్యూఫీల్డ్ కప్‌లో భాగంగా భారత్ గ్రాండ్‌మాస్టర్ల డ్రాల పరంపర కొనసాగుతూనే ఉంది. గుకేశ్, ప్రజ్ఞా నందలు నాలుగో గేమ్‌ను కూడా డ్రాతోనే సరిపెట్టుకున్నారు. మొదట గుకేశ్ ఫ్రాన్స్‌కు చెందిన అలీరెజాతో డ్రా చేసుకోగా.. హాలం డ్ గ్రాండ్‌మాస్టర్ అనీష్ గిరితో తలపడిన ప్రజ్ఞా కూడా గుకేశ్‌ను అనుసరించాడు. 10 మంది ఆటగాళ్లు పాల్గొంటున్న రౌండ్ రాబి న్ టోర్నీలో మరో ఆరు రౌండ్లు మిగిలి ఉన్నాయి. నాలుగు రౌండ్లు ముగిసేసరికి గుకేశ్, ప్రజ్ఞా రెండేసి పాయింట్లతో ఉన్నారు.




