24 March, 2026 | 5:03 PM

ఐసీసీ చైర్మన్‌గా జై షా?

24-08-2024 12:30 AM

న్యూఢిల్లీ: ఐసీసీ చైర్మన్‌గా ప్రస్తుతం విధు లు నిర్వర్తిస్తున్న గ్రెగ్ బార్క్‌లే పదవి త్వరలో ముగియనుంది. మరోమారు పదవి చేపట్టేందుకు ఆయన సుముఖంగా లేకపోవడంతో ఆ పదవి బీసీసీఐ సెక్రటరీ జై షాను వరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 27తో ఐసీసీ చైర్మన్ పదవికి సంబంధించిన నామినేషన్ గడువు ముగియ నుంది. కొత్తగా ఎన్నికైన ఐసీసీ చైర్మ న్ డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. జై షా సహా పలువురు చైర్మన్ పద వికి రేసులో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ జై షా ఐసీసీ చైర్మన్ పదవి చేపడితే బీసీసీఐ సెక్రటరీగా ఎవరు ఎంపికవుతారన్నది ఆసక్తికరం. జై షా చైర్మన్ పదవి చేపడితే బీసీసీఐ సెక్రటరీ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది.