అప్పుల బాధతో గల్ఫ్ కార్మికుని ఆత్మహత్య
24-08-2024 09:05 PM
కామారెడ్డి,ఆగస్టు 24 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో శనివారం ఓ గల్ఫ్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. సదాశివ్ నగర్ గ్రామానికి చెందిన తగిడం రాజిరెడ్డి(41) ఇటీవల అప్పులు చేసి దుబాయ్ కి వెళ్ళాడు. అక్కడ అనారోగ్యానికి గురై అప్పులు తీరక ముందే స్వదేశానికి తిరిగి చేరుకున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక మానసికంగా కృంగి కృషించి ఆవేదనకు గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు. మృతుని భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.






