సమాచార కమిషనర్లను తక్షణమే నియమించాలి
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 24 (విజయక్రాంతి): రాష్ట్ర సమాచార శాఖలో ఖాళీగా ఉన్న చీఫ్ కమిషనర్, సమాచార కమిషనర్లను తక్షణమే నియమించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో సమాచార చీఫ్ కమిషనర్ పదవి బాధ్యతలు గత ఏడాది ఏప్రిల్ తో ముగిసిన గత ప్రభుత్వం కొత్తవారి నియమించ లేదన్నారు. సభ్యులుగా ఉన్న ఐదుగురు పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి తో ముగిసింది అన్నారు. దీంతో రాష్ట్ర సమాచార కమిషన్ నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం కనిపించడం లేదని, సమాచారం అడిగితే దాపరికం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో పౌరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినప్పుడే పాలనలో పారదర్శకత, జవాబు దారితనం ఉంటుందన్నారు . ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో ఆర్టిఐ ద్వారా దరఖాస్తు చేసిన సమాధానము ఇవ్వటం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమాచార కమిషనర్లను నియమించాలని ఆయన కోరారు.






