28-01-2026 12:03:46 AM
సీఆర్పీఎఫ్ జవాన్లకు తీవ్ర గాయాలు
ములుగు,వాజేడు27(విజయక్రాంతి): ములుగు జిల్లాలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్ ఫైర్ కావడంతో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు వాజేడులోని సీఆర్పీఎఫ్ క్యాంపులో జవాన్లు తమ ఆయుధాలను శు భ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో UGBL అత్యాధునిక రకం గన్ ఒక్కసారిగా మిస్ ఫైర్ అయ్యింది. గన్ క్లీన్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభ వించడంతో అక్కడే ఉన్న ఇద్దరు జవాన్లు ప్రమాదానికి గురయ్యారు.ఈ ప్రమాదంలో జవాన్ల వీపు, భుజం మరియు నడుము భా గాల్లో బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది.
పేలుడు ధాటికి వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే తోటి సిబ్బంది స్పందించి బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనం తరం, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు వారిని మె రుగైన చికిత్స కోసం ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవ సర విభాగంలో చికిత్స అందుతోంది.