28-01-2026 12:03:42 AM
పెద్దపల్లి, జనవరి -27(విజయక్రాంతి): మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి పి.నరేష్ కుమార్ నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ, హైదరాబాద్ వారు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ మైనారిటీ అభ్యర్థులకు అకౌంట్ అసిస్టెంట్ యుసింగ్ టాలి, ఫైర్ & సేఫ్టీ, ఫ్రంట్ ఆఫీస్ ఎక్సిక్యుటివ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు లలో 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించుట కొరకు పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీస్ ముస్లిం, సిక్కు, జైన్స్, బుద్ధిష్ట్ , పార్సిస్ అభ్యర్ధుల నుండి ధరఖాస్తులను ఆహ్వానించడమైనది.
అభ్యర్థులు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండి వయసు 18 నుండి 35 సంవత్సరాల లోపు వుండాలి.అర్హత , ఆసక్తి కలిగిన నిరుద్యోగ మైనారిటీస్ అభ్యర్థులు తమ ధరఖాస్తులను ఫిబ్రవరి 3 2026 లోపు పెద్దపల్లి కలెక్టర్ లోని మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయము, మొదటి అంతస్తు, రూమ్ నెం. 232 నందు సమర్పించాలని, ఇతర వివరముల కొరకు ఫోన్ నంబర్ నందు 08728-222266 పని దినాలలో ఉదయం 10:30 గంటల నుండి 5:00 గంటల వరకు సంప్రదించవచ్చని జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి పి.నరేష్ కుమార్ నాయుడు ఆ ప్రకటనలో తెలిపారు.