20-01-2026 08:11:18 PM
గద్దర్ స్ఫూర్తి పురస్కారానికి ఎంపికైన గుంటి పిచ్చయ్య
మఠంపల్లి: విభిన్న కళకు కేరాఫ్ అడ్రస్ తన ప్రత్యేకతను పలు ప్రదర్శనల ద్వారా ఆకర్షించి అవార్డులు రివార్డులు అందుకున్న వ్యక్తి డాక్టర్ గుంటీ పిచ్చయ్య,కళత్మక ప్రదర్శనకు కళారంగా విశిష్ట సేవలకు గద్దర్ స్ఫూర్తి పురస్కారం మఠంపల్లి మండలలాకి చెందిన జానపద పౌరాణిక, చారిత్రాత్మక సాంఘిక, నాటికాలు నాటకాలు, నృత్య ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలలో విశిష్ట సేవలు అందించినందుకు గాను డాక్టర్ గుంటీ పిచ్చయ్య గద్దర్ స్ఫూర్తి పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్ చేతుల మీదుగా ఈ అవార్డ్ పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు ఓ యు రితేష్ బాబు ,పుడమి సాహితి వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సి హెచ్ బాల్ రెడ్డి, పాన్ ఇండియన్ సోషల్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రాజ ఒక ప్రకటనలో తెలియజేశారు. జనవరి 29న ఈ అవార్డును ప్రధానం చేయనున్నట్లు డాక్టర్ గుంటీ పిచ్చయ్య తెలియచేశారు,