calender_icon.png 20 January, 2026 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50 మంది నేత్ర, అవయవ దానానికి అంగీకారం

20-01-2026 08:07:49 PM

 నేత్ర, అవయవ శరీరదాన అవగాహన సదస్సు

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): బెల్లంపల్లి మండలం బుధ కలాన్ గ్రామంలో నిర్వహించిన మహిళ సమాఖ్య సమావేశంలో జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో సదాశయా ఫౌండేషన్ సదశయా ఫౌండేషన్ వారి సహకారంతో నేత్ర, అవయవ  శరీర దాన అవగాహన సదస్సు జరిగింది. నేత్ర అవయవ దాతల అంగీకార పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆడెపు సతీష్  మాట్లాడుతూ అన్ని దానాల్లోకి నేత్ర, అవయవ మరియు శరీర దానం గొప్పదన్నారు.

పుట్టిన ప్రతి ప్రానీ గిట్టక తప్పదని, మరణించిన తరువాత నేత్ర, అవయవ,శరీరాలు వృధా కాకుండా దానం చేసి సమాజానికి ఉపయోగపడాలని కోరారు. నేత్ర దానం ద్వారా ఇద్దరు అందులకి చూపు ప్రసాదించి వారి ద్వారా మరణించిన ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. బుధ కలాన్ గ్రామ సర్పంచ్ దాడి నగేష్, ఉప సర్పంచ్ చింతపురి అనసూర్య, వార్డు సభ్యులు ఆవుల రాజన్న, కోట సుధాకర్, ఓరగంటి సంపత్, పాయబోయిన స్వప్న, రాంపెల్లి శ్రీనివాస్, మహిళా సంఘం సభ్యులు సుమారు 50 మంది నేత్ర అవయవ దానానికి అంగీకారం తెలిపారు.

వారికి సదశయా ఫౌండేషన్ ద్వారా డోనర్ కార్డులు అందజేశారు. శరీరధానానికి ముందుకు వచ్చిన కోట కరుణాకర్ ను శాలువతో సత్కరించి డోనర్ కార్డ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి హరిక్రిష్ణ, వెలుగు కో ఆర్డినేటర్ రాజనాల సుందరేష్  జనహిత సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాంపెల్లి విజయ్ కుమార్, కోశాధికారి కొడిపెళ్లి గిరిప్రసాద్, గౌరవ సలహాదారులు సింగతి తిరుమల్ కార్యవర్గ సభ్యులు మోటపకుకుల అజయ్ పాల్గొన్నారు.