17 April, 2026 | 3:10 AM

గురువుకు గురుదక్షిణ పూర్వ విద్యార్ధుల ఆర్థిక సహాయం

17-04-2026 01:02 AM

సంబోజి శేఖర్ కుటుంబానికి రూ.40,500/ అందజేత

చొప్పదండి, ఏప్రిల్ 16(విజయక్రాంతి): సీనియర్ పాత్రికేయులు, వీణాదరి విద్యా నికేతన్ స్కూల్ లో 2002-03 సంవత్సరం లో ఉపాధ్యాయునిగా పనిచేసిన సంబోజి శేఖర్ గుండెపోటుతో ఇటీవల మరణించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి గురువుకు గురుదక్షిణగా వీణాదరి విద్యానికేతన్ 2002-03 పూర్వ విద్యార్థులు 10 వ తరగతి బ్యాచ్ వారు 40,500/-రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూమా జీవితాలకు వెలుగు చూపిన దీప స్తంభం జ్ఞానం మాత్రమే కాదు, విలువలు నేర్పిన మహానుభావుడు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఆదర్శ గురువు అని గుర్తు చేసుకున్నారు. ఆయనచేసి బోధనలు ఎప్పటికీ మా జీవితాలకు మార్గదర్శకం అని అన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థులందరూ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో పూర్య విద్యార్థులు పెద్ది గోపికృష్ణ, కొల్లూరి జితేందర్ పాల్గొన్నారు.