calender_icon.png 19 June, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎస్పీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా గ్యార మల్లేష్ నియామకం

19-06-2025 12:00:00 AM

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 18: బహుజన సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్య దర్శిగా గ్యార మల్లేష్ నియామకం అ య్యారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ఆదేశాలకు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు పల్లా టి రాములు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ చార్జి లింగంపల్లి యాదగిరి హాజరై మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.

13 ఏండ్ల నుంచి పార్టీకి ఎన్నో సేవలు అందించిన గ్యార మల్లేష్‌ను రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా నియమించినట్లు తెలిపారు. అనంతరం గ్యార మల్లేష్ మాట్లాడుతూ.. నాకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ బ లోపేతం కోసం, భారత రాజ్యాంగం రక్షణ కోసం, బహుజనులకు రాజ్యాధికారం కోసం, బీసీలకు న్యాయబద్ధమైన 60% రిజర్వేషన్ల కోసం, ప్రభుత్వ విద్యా, వైద్యం, ఉపాధి కోసం శక్తికి మించి పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గ్యార జగన్, దొడ్డి శ్రీనివాస్, బండారి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు, ఏడు అసెంబ్లీల నాయకులు తదితరులుపాల్గొన్నారు.