03-02-2026 12:34:39 AM
ఘట్ కేసర్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి) : వెంకటాపూర్ లోని అనురాగ్ విశ్వవిద్యాలయం ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20,21 న జరుగు హ్యాకట్రానిక్స్ 2.0 హ్యాకతాన్ పోస్టర్ ను డీన్ ఎస్ వోఈ డాక్టర్ వి. విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ హ్యాకతాన్ నందు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు రోబోటిక్స్ , వి.ఎల్.ఎస్.ఐ , ఏఐఐఓటి మరియు ట్రాక్ సాట్ విభాగాలలో పాల్గొంటారు. ఈ హ్యాకతాన్ కు ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణ కమతం ప్రోగ్రాం చైర్ గా, డాక్టర్ ఎం. నారాయణ, డాక్టర్ ఏ. రాధిక కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు డాక్టర్ జి. రేణుక, ఎల్. ప్రవీణ్ కుమార్, డాక్టర్ సంతోష్, అసోసియేట్ డైరెక్టర్ ఓఐఏ, డాక్టర్ స్వప్న కుమారి, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.