03-02-2026 12:35:12 AM
మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 15న జాగారన్ సేవా కార్యక్రమాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 2(విజయక్రాంతి) : శ్రీమహా శివరాత్రి జాగరణ సేవా సమితి, రహీంపుర ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ నెల 15న జాగారన్ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు మాడిశెట్టి సదానంద గుప్తా తెలిపారు. సోమవారం కార్యక్రమాలకు సం బంధించి ఆహ్వాన పత్రికను శ్రీశంకర్ జి హనుమాన్ జి దేవాలయంలో ము ఖ్య అతిథులు మంగళహాట్ డివిజన్ కార్పొరేటర్ శశికళ కృష్ణ పరమేశ్వరి సింగ్, పీసీసీ జనరల్ సెక్రెటరీ జాగ్రాన్ సమితి ప్రతినిధులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు.
ఈ నెల15 వ తేదీన రాత్రి 8.10 గంటలకు రహీంపుర ప్లే గ్రౌండ్ అంబేద్కర్ భవన్, మైదానంలో కనివిని ఎరుగని రీతిలో ఈ జాగారం కార్యక్రమం జరుగుతుందని మాడిశెట్టి గుప్తా పేర్కొన్నారు,ఈ జాగారంలో,జై భవాని కీర్తన్ మండల్ భాగ్యనగర్ వారిచే భజన మండలిచే భజన తదితర భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
కార్యక్రమంలో జాగారం సేవా సమితి,జనరల్ సెక్రటరీ ఎస్ రాజన్ కుమార్,కోశాధ్యక్షులు పి రంజిత్ కుమార్, అడిషనల్ ట్రెజరర్ డి రాజేందర్ సింగ్, ఆర్గనైజేషన్ సెక్రటరీ. తోట శ్రవణ్ కుమార్, సలహాదారులు పి రవీందర్ సింగ్, డి శైలేందర్ సింగ్ ,గోపాల్ సింగ్, యాద శ్రీనివాస్ గుప్తా, జీ గోపాల్ సింగ్, సీహెచ్ ప్రదీప్ కుమార్, సురేందర్ సింగ్,ఉపాధ్యక్షులు భాగ్య సింగ్, సీ నవీన్ కుమార్, పి పాండు, పి సందీప్ గుప్తా, నితిన్ రాజ్, సీహె చ్ గోవింద్ గుప్తా, బి మహేష్, బి శివ, సీ శివ, తదితరులు పాల్గొన్నారు.