15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

25-02-2026 01:14 AM

నవాబ్పేట, ఫిబ్రవరి 24: మండలం చాకల్పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 19 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి, జినుకుంట పురుషోత్తం మనస్తాపంతో పురుగుల మందు తాగి ప్రా ణాలు కోల్పోయిన సంఘటన చోటుచేసుకుంది. మృతుని సోదరుడు జినుకుంట శివకుమార్ నవాబ్పేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నవాబ్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ (బీపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నాడు.

గత కొం తకాలంగా అతను చదువుపై ఆసక్తి చూపక, కళాశాలకు సరిగ్గా వెళ్లడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై ఆరా తీయగా, చదువు అబ్బడం లేదని, ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ ప్రేమ విఫలం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తమ్ముడు తమతో చెప్పాడని శివకుమార్ పేర్కొన్నారు.చికిత్స పొందుతూ మృతి చెందాలని తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులుమృతుని మరణంపై తమకు ఎవరిపైనా అనుమానం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ మేరకు నవాబ్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.