6 July, 2026 | 1:52 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

శంకర్‌పల్లిలో వడగళ్ల వాన

18-03-2026 01:10 AM

శంకర్‌పల్లి, మార్చి 17 (విజయక్రాంతి): శంకర్ పల్లి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో మంగళవారం భారీ వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో సుమారు అరగంట పాటు ఆకాశం నుండి మంచు ముక్కలు వర్షంలా కురిశాయి. కేరింతలు కొట్టిన చిన్నారులుచాలా కాలం తర్వాత వడగళ్ల వాన కురవడంతో స్థానిక పిల్లలు, పెద్దలు ఆనందానికి లోనయ్యారు.

చిన్నారులు గొడుగులు పట్టుకుని వీధుల్లోకి వచ్చి, వడగళ్లను ఏరుకుంటూ కేరింతలు కొట్టారు. వీటిని నోటిలో వేసుకుంటే చలికాలంలో శరీరానికి వేడి పుడుతుందని పెద్దలు చెప్పడంతో, ఉత్సాహంగా ఆ వడగళ్లను తింటూ సరదాగా గడిపారు.పంట పొలాల్లో మంచు కుప్పలుమండలంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షం కురవగా, మరికొన్ని గ్రామాల్లో మాత్రం వడగళ్లు కుప్పలు కుప్పలుగా పడ్డాయి.

ముఖ్యంగా పంట పొలాల్లో మంచు రాళ్లు పేరుకుపోయి తెల్లటి దుప్పటి కప్పినట్లుగా కనిపించాయి. అకాలంగా కురిసిన ఈ వడగళ్ల వాన వల్ల కొన్ని చోట్ల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సుమారు 30 నిమిషాల పాటు వాన కురిసింది.