మొయినాబాద్‌లో గ్యాస్ కష్టాలు
18-03-2026 01:12 AM
సిలిండర్ల కోసం వినియోగదారుల పడిగాపులు
మొయినాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): మొయినాబాద్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. గ్యాస్ సిలిండర్ల కోసం స్థానిక ప్రజలు, మహిళలు మరియు వృద్ధులు ఉదయం నుంచే ఏజెన్సీల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. బుకింగ్ చేసుకున్న వారికీ సకాలంలో సిలిండర్లు అందకపోవడంతో వినియోగదారులు నేరుగా ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు.
కొందరైతే మూడు రోజులుగా తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు. పెరిగిన డిమాండ్ మరియు అంతర్జాతీయ స్థాయిలో సరఫరా లోపాల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు పేర్కొంటున్నారు.అధికారులు వెంటనే స్పందించి సరఫరాను క్రమబద్ధీకరించాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.




