26 July, 2026 | 1:45 AM

అక్రమ నిర్మాణ పనుల నిలుపుదల

26-07-2026 12:00 AM

ఘట్ కేసర్, జూలై 25 (విజయక్రాంతి) :  ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని యంనంపేట్, నారపల్లిలో అనుమతు లకు విరుద్ధంగా నిర్మాణం పనులు చేస్తున్న వారికి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేసి అట్టి పనులను నిలుపుదల చేశారు. యజమానులు సెలవు దినాలలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నందున  పలుమార్లు కూల్చివేతలు చేయడమైనదని, కానీ భవన యజమానులు యధావిధిగా పనులు చేయుచున్నందున శనివారం టౌన్ ప్లానింగ్ విభాగం వారు పోలీసు శాఖ వారి సహాయంతో అట్టి 9 నిర్మాణములను సీజ్ చేయడమైనదని తెలిపారు.

భవన నిర్మాణదారులు అనుమతులకు అనుగుణంగా నిర్మాణం చేసుకోవాలని నిబంధనలను అతిక్రమించినచో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడతాయని అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీధర్ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ బి. శ్రీదేవి, పోచారం ఐటీ కారిడార్ పోలీస్ శాఖ వారు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.