విద్యార్థులపై నమోదైన కేసులు ఎత్తివేయాలి
డీబీపీ జాతీయ అధ్యక్షుడు కృష్ణ స్వరూప్
ముషీరాబాద్, జూలై 25(విజయక్రాంతి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్వాగతిస్తూ దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమి(ఎన్డీఎస్‌ఎఫ్) చైర్మన్ వడ్లమూరి కృష్ణ స్వరూప్ హర్షం వ్యక్తం చేశారు. నీట్ పరీక్షల నిర్వహణ, సీబీఎస్‌ఈలో జరిగిన అవినీతి, అక్రమాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయా ల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
కాక్రొచ్ జనతా పార్టీ(సీజెపి) చీఫ్ అభిజిత్ దీపకే నాయకత్వంలో జరిగిన విద్యార్థుల జాతీయ స్థాయి ఉద్యమం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని కృష్ణ స్వరూప్ అన్నారు. విద్యా ర్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లాఠీచార్జీలో గాయపడిన వారికి రూ.20 లక్షల పరిహారం, నీట్ అంశంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.2 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, నీట్ లీకేజీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీబీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాషా, ఇండియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర కన్వీనర్ ఎం.డి.ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.






