22 August, 2026 | 2:06 AM

వన్యప్రాణిని కాపాడిన హమాలీలు

23-05-2024 02:03 AM

అటవీ అధికారులకు అప్పగింత

జయశంకర్ భూపాలపల్లి, మే 22(విజయక్రాంతి): దారి తప్పి అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చి కుక్కల దాడిలో గాయపడ్డ ఓ వన్యప్రాణికి హమాలీ కార్మికులు ప్రాణం పోశారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంటలో చోటు చేసుకుంది. వల్లెంకుంట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఓ జింక దారి తప్పి గ్రామ శివారులోకి రావడంతో కుక్కలు దాని వెంటపడ్డాయి. కుక్కల బారి నుంచి తప్పించుకున్న జింక వడ్ల కొనుగోలు కేంద్రానికి చేరగా గమనించిన హమాలీ కార్మికులు, రైతులు పట్టుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడకు చేరుకుని జింకకు ప్రథమ చికిత్స చేసి అడవిలోకి వదిలి పెట్టారు. వన్యప్రాణిని కాపాడిన హ మాలీలు, రైతులను, మాజీ సర్పంచ్ రమేశ్‌ను ఫారెస్ట్ అధికారులు అభినందించారు.