తునికాకు కూలీలకు ఇబ్బందులు రానివ్వొద్దు
23-05-2024 01:55 AM
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు
భద్రాద్రి కొత్తగూడెం, మే 22 (విజయక్రాంతి): తునికాకు సేకరించే కూలీలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వొద్దని ఎస్పీ రోహిత్‌రాజు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన తునికాకు వ్యాపారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టులతో తునికాకు వ్యాపారులకు ఎదు రవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తునికాకు సేకరణపై ఆధారపడి జీవించే ఆదివాసీలకు ఇబ్బందులు రాకుం డా చూడాలని తెలిపారు. మావోయిస్టుల గు రించి ఎలాంటి సమాచారం తెలిసినా పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.






