10 April, 2026 | 4:55 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

నిఘా నీడలో పోలింగ్

13-05-2024 02:29 AM

ఎన్నికల విధుల్లో కేంద్ర, రాష్ట్ర బలగాలు 

సమస్యాత్మక ప్రాంతాల్లో జియో ట్యాగింగ్

నగర వ్యాప్తంగా 30,500 మంది పోలీసులు

ప్రజలు నిర్భయంగా ఓటు వేయండి

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్ల పిలుపు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (విజయక్రాంతి): నగరంలో పోలింగ్ సజావుగా సాగేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు విధుల్లో ఉంటాయని వివరించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం కలిపి నగరవ్యాప్తంగా సుమారు 30,500 మంది పోలీసులు పోలింగ్ విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని వారు సూచించారు.

అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటికి జి యో ట్యాగింగ్ అనుసంధానం చేశామని, ఎన్నికల ప్రక్రియను, ఎన్నికల భద్రత, బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించను న్నట్లు హైదరాబాద్, సైబరా బాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, అవినాష్ మహంతి, తరు ణ్ జోషిలు తెలిపారు. సౌత్‌జోన్‌లో ఎక్కువ సంఖ్యలో ఉన్న సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి ఇన్‌స్పెక్టర్లతో స్పెషల్ రూట్ మ్యాప్ తయారు చేశామన్నారు. డీసీపీలు, ఏసీపీలు జోన్లు, డివిజన్ల వారీగా సమీక్షలు నిర్వహించి వ్యూహా త్మకంగా నిఘా పెట్టనున్నట్లు వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలు లేని, ప్రశాంతమైన వాతా వరణంలో లోక్‌సభ ఎన్నికలు జరిగేలా పటిష్టమైన భద్ర తా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

భద్రతా ఏర్పాట్లు పరిశీలన

ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి లో భద్రత, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పర్యవేక్షించారు. ఆదివారం కమిషనరేట్ పరిధిలోని సైనిక్‌పురి భవన్స్ కళాశాల, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, గుర్రం గూడ స్ఫూర్తి కళాశాల, మేడ్చల్ హోలీ మేరీ కళాశాలలో ఎన్నికల ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అవసరానికి తగ్గట్టుగా కౌంటింగ్ టేబుళ్లు, రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

హైదరాబాద్ సైబరాబాద్  రాచకొండ 

పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనరేట్

భద్రతా బలగాల సంఖ్య 15,000 7000 8500

మొత్తం పోలింగ్ ప్రాంతాలు 1688 1218 1590

మొత్తం పోలింగ్ కేంద్రాలు 4036 3209 3396

సమస్యాత్మక ప్రాంతాలు 383 90 188