25 June, 2026 | 1:32 AM

పోగొట్టుకున్న ఫోన్ల అప్పగింత

25-06-2026 12:00 AM

అర్మూర్, జూన్ 24 (విజయ క్రాంతి) : ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి 10 మొబైల్ ఫోన్లను  సి.ఈ.ఐ.ఆర్. పోర్టల్  ద్వారా సేకరించి బాధితులకు  అప్పగించినట్లు అర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఏడాది క్రితం పోయిన మూడు ఫోన్లను, అయిదు నెలలలోపు పోయిన ఏడు మొబైల్ ఫోన్లను తిరిగి ఇవ్వడం జరిగిందన్నారు.  వంశి, సాయినాథ్, నందకిషోర్, బండ్ల విశాల్, తలారి నితిన్, పూర్ కీర్తన్, శ్రావణి, దాసరి ప్రశాంత్, గోల్లపల్లి సుధారాణి, అనంతరావులకు అప్పగించినట్లు సిఐ వివరించారు.