20 June, 2026 | 2:17 AM

బాధితులకు ఫోన్ల అప్పగింత

20-06-2026 12:50 AM

అర్మూర్, జూన్ 19 (విజయక్రాంతి): ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా సేకరించి 10 మంది బాధితులకు మొబైల్ ఫోన్లలను అప్పగించినట్లు అర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

ఇందులో 2 సంవత్సరాల క్రితం 3, ఏడాది క్రితం 2 మొబైల్ లు, నెల రోజుల క్రితం పోయిన 5 మొబైల్ ఫోన్లను అప్పగించినట్లు పేర్కొన్నారు. తోట రాజమణి, భాగ్యలక్ష్మి, గట్ట సత్యనారాయణ, మొగులయ్య, రాజేందర్, వినీష్ చౌహన్, ఉమాదేవి, నిషిత్ పర్వీన, గడ్డం కరుణాకర్, చిల్ల శ్రీనివాస్ లకు అప్పవించినట్లు వివరించారు.