20 June, 2026 | 2:36 AM

23న బడుల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

20-06-2026 12:49 AM
  1. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు దోపిడీని అరికట్టాలని డిమాండ్
  2. ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు సర్కారు కుట్ర పన్నుతోందని ఆరోపణ

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పి  లుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు ప్రభు త్వం కుట్ర చేస్తోందని, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి కొమ్ము కాస్తోందంటూ ఏబీవీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ బంద్ ను చేపట్టనున్నట్లు తెలిపారు.

27 వేల ప్రభుత్వ స్కూళ్ల లో 23 వేల స్కూళ్లను మూసివేస్తామన్న సీఎం ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రకటనను విడుదల చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించే విద్యాహక్కు చట్టాన్ని  అమలు చేయాలని, ఎంఈవో, డీఈవో,టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను   చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌళికవసతులు కల్పించాలని, విద్యార్థులకు యూనిఫామ్స్ వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.