24 April, 2026 | 5:26 PM

రూ.33 కోట్ల చేనేత రుణాలు మాఫీ

02-07-2025 12:08 AM
  1. నేతన్నలకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ ప్రభుత్వం
  2.   2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి వరకు రుణాలు మాఫీ

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): తెలంగాణలోని నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రూ.33 కోట్ల చేనేత రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య (టెక్స్‌టైల్) శాఖ  ఈ ఏడాది బడ్జెట్‌లో చేనేత కార్మికులకు రుణమాఫీ చేసేందుకు రూ.33 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం (లోన్ వీవర్ టు హాండ్లూమ్ వీవర్స్ స్కీం) కింద ఈ నిధులు మంజూరు చేస్తున్నట్లు హాండ్లూమ్స్ మరియు అప్పారెల్ ఎక్స్‌పోర్టు పార్క్స్ కమిషనర్‌కు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి వరకు తీసుకున్న చేనేత రుణాలు మాఫీ అవుతాయి. ఈ సందర్భంగా సీఎంకు చేనేత కార్మికులు, నేతన్నలు కృతజ్ఞతలు తెలిపారు.