03-12-2025 12:28:19 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య దశాబ్దాల కాలం నుండి కొనసాగుతున్న వర్గ విభేదాలు ఇప్పటికైనా సమసిపోయే నాని చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో నెలకొంది. తాజాగా కాంగ్రెస్ నేతలందరూ చేతులు కలుపుకుని ఐక్య రాగాన్ని ప్రదర్శించిన... వారి మనసులు మంత్రం కలిసినా అనే అనుమానం ఇప్పటికీ కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పార్టీలోని పలువురు నాయకులు వర్గాలుగా విడిపోయి కొన్నేళ్లుగా ఒకరిపై ఇంకొకరు డీసీసీ కోసం ఢీకొన్నారు.
ఎట్టకేలకు పార్టీ అధిష్టానం నూతన డీసీసీ అధ్యక్షుడుగా సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్ ను ప్రకటించడంతో జిల్లాలో డీసీసీ లొల్లికి చరమగీతం పడింది. ఐతే ఈనెల 4వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన కోసమా, లేదా ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసమో.. తెలియదు కానీ నేతలందరూ తమ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి, అందరూ ఓ చోట చేరి చేతులు కలిపి ఐక్యరాగాన్ని అందుకోన్నపటికి ఎంతో కాలంగా కొనసాగుతున్న విభేదాలు సమిసిపోతాయా లేదా అని అనుమానం ద్వితీయ శ్రేణి నేతల్లో నెలకొంది.
నాటి నుంచి నేతల మధ్య విభేదాలే..
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో నాటి నుండి నేటి వరకు నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో చక్రం తిప్పిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, స్వర్గీయ రామచంద్రా రెడ్డి (సిఆర్‌ఆర్) కాలం నుండే ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ పోరు కొనసాగుతోంది.
అప్పుడు సిఆర్‌ఆర్ వర్గంతో పాటు టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు భార్గవ్ దేశ్పాండే, సాజిద్ ఖాన్ వర్గాల మధ్య తీవ్ర వర్గపోరు కొనసాగింది. వర్గ పోరు ఏ స్థాయికి వెళ్లిందంటే ఇందులో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వచ్చిన ఇతర వర్గానికి చెందినవారే వారిని ఓడించేందుకు కుట్రలు పన్నారనీ ఒకరిపై మరొకరు బహిరంగగానే ఆరోపణలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. కాలక్రమేణ మూడు వర్గాలు ఒక్కటే అయ్యాయి.
కొత్త- పాత వర్గాల మధ్య విబేధాలు...పాత వర్గాల నేతలందరూ ఒకటైనప్పటికీ
ప్రస్తుత కాంగ్రెస్ లో మాత్రం కొత్త, పాత వర్గాల మధ్య వర్గపోరు మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నారై కంది శ్రీనివాస్ రెడ్డిబీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరారు. అంతటితో ఆగకుండా సీనియర్ నాయకులను పక్కనబెట్టి శ్రీనివాస్ రెడ్డి టికెట్టు సాధించుకున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన సీనియర్లు అందరూ ఆగ్రహించారు. అదే సమయంలో మాజీమంత్రి, సీనియర్ నాయకుడు రామచంద్రా రెడ్డి అస్తమించారు.
దీంతో అయినా అల్లుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి తో పాటు టిపిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిత్ ఖాన్, భార్గవ దేశ్పాండేలు ఒక్కటై అప్పుడే పార్టీలో చేరి టికెట్టు సాధించుకున్న కంది శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకించడంతో పాటు రాష్ట్ర నాయకత్వాన్ని సైతం విమర్శించడంతో సీనియర్ నేతలను అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేసింది.
ఎమ్మెల్యే ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయినప్పటికీ ఏకచత్రాధిపత్యంగా ఆయన పార్టీని నడిపించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరేందుకు సీనియర్లు సుమారు రెండేళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. కాగా ఇటీవలే సీనియర్లు మళ్ళీ పార్టీలో చేరారు.
డీసీసీ కోసం తీవ్రంగా...
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం సీనియర్ నాయకులు నరేష్ జాదవ్, బోరం చు శ్రీకాంత్ రెడ్డి, గోక గణేష్ రెడ్డి, ఆడే గజేందర్ తో పాటు ఇటీవలే పార్టీలో చేరిన కంది శ్రీనివాస్ రెడ్డి, సోయం బాపురావులు తీవ్రం గా పోటీ పడ్డారు.
సుమారు రెండేళ్ల తర్వాత ఈ మంత్రి సిఆర్‌ఆర్ వర్గానికి చెందిన డా. నరేష్ జాదవ్ ను నూతన డీసీసీ అధ్యక్షునిగా అధిష్టానం ప్రకటించింది. అయితే పదవి కోసం తీవ్రంగా పోటీపడ్డ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాం త్ రెడ్డి వర్గీయులు నూతన డీసీసీ అధ్యక్షుని వర్గంతో ఒక్కటై పని చేస్తారా లేదా అనే అనుమానం పార్టీ శ్రేణుల్లో నెలకొన్న సమయంలో పాత కొత్త అని తేడా లేకుండా అందరూ ఒక్కటవ్వడం చేర్చనీయాంశంగా మారింది.
ఈ ఐక్యత రాగం కొనసాగేనా...?
ఎన్నో ఏళ్ల తర్వాత కాంగ్రెస్ లో వర్గ విభేదాలు సమసిపోయి పాత, కొత్త అనే తేడా లేకుండా నేతలు అందరూ ఒకటయ్యారు. ఈ నేతల ఐక్యత రాగం ఎప్పు డూ ఇలానే కొనసాగుతుందా లేదా... ఈనెల 4వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటన సందర్భంగానా.. ప్రస్తు తం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకా అనే అనుమానం కార్యకర్తలను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. మొత్తానికి జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు సమసిపోయాయనే స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.