03-12-2025 12:00:00 AM
-నేడు ప్రధాని, కాంగ్రెస్ నేతలతో భేటీ
-గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్న సీఎం, డిప్యూటీ సీఎం
-వివిధ రాష్ట్రాల సీఎంలకూ ఆహ్వానం
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. నాలుగు వేల మందికి పైగా ప్రముఖులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు. బుధవారం ప్రధాని మోదీతో పాటు పలువు రు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించ నున్నారు. సమ్మిట్‌కు అన్ని రాష్ట్రాల సీఎంల ను ఆహ్వానించే బాధ్యతలను రాష్ట్ర మంత్రులకు సీఎం అప్పగించారు.
మంత్రులు స్వయంగా వెళ్లి.. ఆయా రాష్ట్రాల సీఎంలను కలిసి ఆహ్వానించనున్నారు. మం త్రులు ఆయా రాష్ట్రాలకు గురువారం (4వ తేదీ) వెళ్లి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రాలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందజేయనున్నారు. ఢిల్లీ సీఎంతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లకు మన రాష్ర్ట ఎంపీలు ఆహ్వానం అందించనున్నారు.
మంత్రులకు బాధ్యతలు
జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పంజాబ్, హరియాణా దామోదర్ రాజనర్సింహ, ఆంధ్రప్రదేశ్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కర్ణాటక, తమిళనాడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తర ప్రదేశ్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజస్థాన్ పొన్నం ప్రభాకర్, ఛత్తీస్‌గఢ్ కొండ సురేఖ, పశ్చిమ బెంగాల్ సీతక్క, మధ్యప్రదేశ్ తుమ్మల నాగేశ్వరరావు, అస్సాం జూపల్లి కృష్ణారావు, బీహార్ వివేక్ వెంకటస్వామి, ఒడిషా వాకిటి శ్రీహరి, హిమాచల్‌ప్రదేశ్ అడ్లూరు లక్ష్మణ్‌కుమార్, మహారాష్ట్ర మహ్మద్ అజారుద్దీన్ తదితర మంత్రులు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నారు.