ప్రధానమతంగా సనాతనం
అఖిల భారత ఇస్కాన్ ఉపాధ్యక్షుడు మహామాన్
ముషీరాబాద్, మే 12 (విజయక్రాంతి): పాశ్చాత్య దేశాలతోపాటు అనేక దేశాలలో వేగంగా విస్తరిస్తున్న సనాతన ధర్మం భవిష్యత్తు లో ప్రపంచంలో ప్రధానమతంగా మారుతుం దని అఖిల భారత ఇస్కాన్ ఉపాధ్యక్షుడు హెచ్.జి. మహామాన్ పేర్కొన్నారు. హైదరాబాద్ దూలపల్లి డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థులకు గీత పారాయణం వేసవి శిక్షణ శిబిరం 11 రోజులపాటు ఇస్కాన్ కూకట్‌పల్లి ఆధ్వర్యంలో జరిగాయి. మంగళ వారం స్కూల్ ప్రాంగణంలో గీత పారాయ ణం వేసవి శిక్షణ శిబిరం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ వేడుకల్లో హెచ్‌జీ మహామాన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లా డారు. పవిత్ర భగవద్గీత మానవాళికి ఒక జీవ నాధారంగా విస్తృతంగా పరిగణించబడు తుందన్నారు. డీఆర్‌ఎస్‌ఐఎస్ డైరెక్టర్ అంజనీ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ భగవద్గీత సార్వత్రిక సత్యాల సిద్ధాంతం, అలాగే నైతిక, ఆధ్యాత్మిక వికాసానికి సంబంధించిన గ్రంథం అని, భగవద్గీతను పఠించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
డీ ఆర్ ఎస్ ఐఎస్ ప్రిన్సిపాల్ ఐ. వేణుగోపాల్ మాట్లాడు తూ భగవద్గీతలోని జ్ఞానం విద్యార్థి జీవితంలో నిజమైన వికాసానికి తోడ్పడు తున్నారన్నారు. అధ్యక్షులు మహాశిరింగ్ మాట్లాడుతూ సాను కూల దృక్పథంతో సమతుల్య జీవితం గడ పడం కోసం విద్యార్థులకు గత 38 సంవత్సరా లుగా గీత పఠనం శిక్షణ శిబిరాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ధవళ్ చండే కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు.






